Siva Karthikeyan కమెడియన్స్ ని తక్కువ అంచనా వేయొద్ధు వారు నవ్వించగలరు ఏడిపించగలరు అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. మొన్నటిదాకా కమెడియన్ గా మెప్పించిన సూరి లాస్ట్ ఇయర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో విడుదలై సినిమాతో హీరోగా మారాడు.
ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు గరుడన్ అనే మరో సినిమాతో వస్తున్నాడు. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి అటెండ్ అయ్యారు.
సూరి కామెడీ తనకు చాలా ఇష్టం. అయితే అతన్ని హీరోగా ట్రి చేయమని చెప్పా కానీ అప్పుడు చేయనని చెప్పాడు. ఆ తర్వాత ఒకరోజు వెట్రిమారన్ తనని పెట్టి సినిమా చేస్తా అంటున్నాడు కాస్త దడగా ఉందని తనతో చెప్పాడని సూరి గురించి చెప్పారు శివ కార్తికేయన్. కమెడియన్లు అని తక్కువ అంచనా వేయొద్దు కొంతమందికి సీరియస్ గా నటించడం మాత్రమే వస్తుంది. కామెడీ చేయడం చాలా కష్టం.. కామెడీతో మెప్పించిన వారు ఏదైనా చేయగలరని అన్నారు శివ కార్తికేయన్.
Also Read : Kiara Advani – Janhvi Kapoor : ఆ హీరోకి జంటగా కియారా అద్వానీ, జాన్వీ కపూర్..
విడుదలై సక్సెస్ అయినట్టుగా ఈ సినిమా కూడా సూరికి సక్సెస్ అందించాలని కోరుతున్నానని అన్నారు శివ కార్తికేయన్. ఇదే ఈవెంట్ కు వచ్చిన విజయ్ సేతుపతి కూడా సూరికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని అన్నారు.
మే 31న తమిళంలో మాత్రమే రిలీజ్ అవుతున్న గరుడన్ సినిమా అక్కడ రిజల్ట్ ని బట్టి తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఏర్పడేలా చేశాయి.