Sithara Dance Dum Masala Song సూపర్ స్టార్ ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో ఆయన డాటర్ కూడా ఆ రేంజ్ ని మ్యాచ్ చేస్తుంది. మహేష్ గారాల పట్టి సితార ఘట్టమనేని ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె చేసే డాన్స్ వీడియోస్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా మహేష్ గుంటూరు కారం కి సంబంధించిన దమ్ మసాలా సాంగ్ కి డ్యాన్స్ చేసింది.
We’re now on WhatsApp : Click to Join
మహేష్ ఎనర్జీని దాదాపు మ్యాచ్ చేస్తూ సితార డ్యాన్స్ అదిరిపోయింది. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ ఇటు వెస్ట్రెన్ మీద కూడా పట్టు సాధిస్తుంది సితార. సితా పాప ఏం చేసినా సరే మహేష్ కి నచ్చుతుంది. ఎంతైనా ఆ ఇంటి మహాలక్ష్మి కదా అందుకే అనుకుంట. ఇక గౌతం మాత్రం అసలు సోషల్ మీడియాలో కనిపించడు.
మహేష్ సినిమా రిలీజైన ప్రతిసారి సితార అందులో సూపర్ హిట్ సాంగ్ ని డాన్స్ చేసి ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ కి డాన్స్ చేసి ఆ వీడియో షేర్ చేసింది. దమ్ మసాలా సాంగ్ కి కావాల్సిన మాస్ యాంగిల్ ని మాక్సిమం ట్రై చేసింది సీతా పాప.
కచ్చితంగ ఫ్యూచర్ లో సితార సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఏదో ఒక మ్యాజిక్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక మహేష్ విషయానికి వస్తే గుంటూరు కారం సక్సెస్ కొట్టి జర్మనీ వెళ్లి అక్కడ రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు.