Mrunal Thakur : సీతామహాలక్ష్మిపై కన్నేసిన భన్సాలి.. ఆమె కోసం ప్రత్యేకంగా నిర్మాతగా మారి..!

Mrunal Thakur సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమా హిట్ తో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది.

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 05:46 PM IST

Mrunal Thakur సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమా హిట్ తో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది. సీతారామం సినిమా హిందీ వెర్షన్ కూడా అక్కడం మంచి ఫలితాన్ని రాబట్టుకుంది. అంతకుముందు కూడా బాలీవుడ్ సినిమాల్లో నటించిన మృణాల్ సీతారామం తర్వాత ఆమె ని అప్రోచ్ అయ్యే సినిమాలు వేరుగా ఉన్నాయని తెలుస్తుంది. తెలుగులో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించిన మృణాల్ ఠాకూర్ అటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది.

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ గా ఒక లక్కీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో తెరకెక్కే సినిమాలో అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. సిద్ధాంథ్ చతుర్వేది లీడ్ రోల్ లో రాబోతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో మృణాల్ ని హీరోయిన్ గా లాక్ చేశారట.

సంజయ్ లీలా భన్సాలి సినిమాలకు బాలీవుడ్ లో సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేయడమే కాదు నిర్మించే సినిమాలకు అదే రేంజ్ బజ్ ఉంటుంది. మృణాల్ సౌత్ లో చేస్తున్న సినిమాలు చూసే ఆమెకు ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ని రవి ఉద్యావర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. భెన్సాలినే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా అందించనున్నారని టాక్. మొత్తానికి మృణాల్ ఠాకూర్ సంజయ్ లీల భన్సాలి సినిమాలో భాగం అవ్వడం ఆమె కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

Also Read : Actress Hema : రేవ్ పార్టీ వ్యవహారం.. నటి హేమ బ్లడ్ శాంపిల్‌లో డ్రగ్స్.. 86 మందికి పాజిటివ్