Site icon HashtagU Telugu

Mahesh Babu : ‘సితారే జమీన్ పర్’పై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Sitare Zameen Par

Sitare Zameen Par

Mahesh Babu : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మరోసారి తనదైన భావోద్వేగ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన నటించిన తాజా సినిమా ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. మానసికంగా వెనుకబడ్డ పిల్లల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం, ఆమోదయోగ్యమైన సందేశంతో పాటు వినోదాన్ని సమపాళ్లలో మేళవించి ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. ప్రముఖ చిత్రం ‘తారే జమీన్ పర్’ కు ఆధ్యాత్మిక సీక్వెల్‌గా భావించబడుతున్న ఈ చిత్రానికి ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, జెనీలియా, అరౌష్ దత్త, గోపి కృష్ణన్ వర్మ, నమన్ మిశ్రా, వేదాంత్ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఇక ఈ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ట్విట్టర్ (X) వేదికగా ఆయన చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “సితారే జమీన్ పర్ ఓ అద్భుతమైన చిత్రం. అమీర్ ఖాన్ మిగతా క్లాసిక్‌ల మాదిరిగానే ఈ చిత్రమూ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, హృదయాన్ని తాకుతుంది. సినిమా పూర్తయ్యేసరికి చిరునవ్వుతో థియేటర్‌ నుంచి బయటకి వస్తారు” అని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సినిమా పట్ల సినీ ప్రముఖులు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుండగా, మహేష్ బాబు లాంటి స్టార్ కూడా ప్రశంసించడం, సినిమా బజ్‌ను మరింత పెంచింది.

Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ వాడాను.. బెయిల్ ఇవ్వండి