Sitara : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మహేష్ కూతురు సితార..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది

Published By: HashtagU Telugu Desk
sitara birthday special

sitara birthday special

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార (Sitara) మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. చిన్నప్పటి నుండి వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ కూతురిగా అందరి చేత అనిపించుకుంటూ వస్తుంది. మహేష్ ఏలైతే సమాజానికి పలు సేవ కార్యక్రమాలు చేస్తాడో..కూతురు సితార కూడా తండ్రికి తీసిపోని రీతిలో ఇప్పటి నుండే తనకు వచ్చిన రెమ్యూనరేషన్ ను సమాజానికి ఇస్తుంది. తొలిసారి సోలోగా ఒక వాణిజ్య ప్రకటనలో సితార (Sitara) నటించింది. చిన్న వయసులోనే PMJ జ్యుయలర్స్ అనే ఆర్మమెంట్స్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా నియమితురాలైంది. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చి తన గొప్ప మనసు చాటుకుంది. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేసి శభాష్ అనిపించుకుంటుంది.

నేడు (జులై 20) తన 11వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది సితార (SitaraBirthday). విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించి.. వారితో సరదాగా మాట్లాడింది. తర్వాత ఆ విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. సైకిళ్లను అందజేసి వారితో ఫొటోలు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్‌ కూతురు పెద్ద మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే తను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

Read Also : Baby : ప్రభాస్ ను క్రాస్ చేసిన బేబీ..మాములుగా లేదు కదా

  Last Updated: 20 Jul 2023, 05:14 PM IST