Sitaramam: 40 కోట్ల క్లబ్ లో దుల్కర్ “సీతారామం”…!!

మలయాళం స్టార్ హీరో దుల్కర్ టాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నాడు. పదేళ్లలో దుల్కర్ 35కిపైగా సినిమాలు చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Sitaramam

Sitaramam

మలయాళం స్టార్ హీరో దుల్కర్ టాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నాడు. పదేళ్లలో దుల్కర్ 35కిపైగా సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ఆయన మొదలుపెట్టి చాలాకాలమే అయ్యింది. టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఓ మూవీ చేయాలన్న ఉద్దేశ్యంతో దుల్కర్ సీతారామం కథను ఎంచుకున్నాడు.

ఈనెల 5న ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఒకవైపు ప్రేమ..మరోవైపు యుద్ధం ఈ కథలో రెండు కలిసి నడుస్తాయి. ఒకరు దేశం కోసం ప్రమే త్యాగం చేస్తే…మరొకరు ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. కాగా ఈ మూవీ తెలుగురాష్ట్రాలకు సంబంధించి ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా నడిచిందన్న టాక్ వినిపించింది.

కానీ ఓవర్సీస్ విషయానికొస్తే ఈ విధమైన కథ వారికి నచ్చింది. దాంతో అక్కడ ఈ మూవీకి మంచి వసూళ్లు రాబట్టింది. వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. పెద్ద సినిమాలేవీ లేకపోవడం వల్ల ఈ సినిమా వసూళ్ల జోరు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Last Updated: 12 Aug 2022, 06:56 PM IST