Sita Ramam : సీతారామం సినిమాలో మృణాల్, రష్మిక పాత్రలు.. అసలు ఆ హీరోయిన్స్ చేయాల్సింది.. ఎవరో తెలుసా..?

సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగు ఆడియన్స్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. కాగా ఈ సినిమాలో సీతగా మృణాల్ కంటే ముందు మరో హీరోయిన్ ని అనుకున్నారట.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 08:30 PM IST

2022 మాన్సూన్ చల్లటి చిరుజల్లుతో పాటు ‘సీతారామం'(Sita Ramam) వంటి అందమైన ప్రేమ కథని కూడా మోసుకొచ్చింది. ఆ సినిమాలోని సీతారాముల ప్రేమ కథ చూసి ప్రతి ఒక్కరి మనసు నీలిమేఘంలా కరిగిపోయింది. వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమాలో రామ్ గా నటించిన దుల్కర్ జీవించేశాడు అనే చెప్పాలి. ఇక సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగు ఆడియన్స్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. కాగా ఈ సినిమాలో సీతగా మృణాల్ కంటే ముందు మరో హీరోయిన్ ని అనుకున్నారట. పూజా హెగ్డే (Pooja Hegde) సీత పాత్రకి మొదటి ఎంపిక అంట. కానీ ఏమైందో తెలియదు గాని ఆ ఛాన్స్ మృణాల్ కి వెళ్ళింది. అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన రష్మిక రోల్ కి కూడా మరో టాలీవుడ్ హీరోయిన్ ఫస్ట్ ఛాయస్. తానెవరో కాదు రాశి ఖన్నా (Raashii Khanna).

కానీ చివరికి చిత్ర యూనిట్ రష్మికని ఫైనల్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన ఆడియన్స్.. రష్మిక పాత్రలో మరొకర్ని ఊహించుకోగలం గాని, మృణాల్ పాత్రని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ నేటితో (ఆగష్టు 5) ఏడాది పూర్తి చేసుకుంది. కానీ ఆ ప్రేమ కథ మాత్రం ఇంకా అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఎన్నాలైన ఈ సీతారామం రమణీయంగా మిగిలిపోతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం.. ఈ మూవీని సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీతారాముల కథని ప్రతి ఒక్కరి గుండెకు మరింత దగ్గర చేసింది.

 

Also Read : Samantha : మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు 25 కోట్ల ఖర్చు.. కౌంటర్ ఇచ్చిన సమంత..