Mrunal Thakur: ‘సీతారామం’ బ్యూటీకి భలే డిమాండ్

“సీతా రామం” విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Mrunal

Mrunal

“సీతా రామం” విజయం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేసింది. ఈ చిత్రం తెలుగులో ప్రేమకథల జోనర్‌ కు మళ్లీ నాంది పలికేలా చేసింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి కూడా మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఈ  సినిమాతో ముఖ్యంగా నటి మృణాల్ ఠాకూర్ వెలుగులోకి వచ్చింది. మృణాల్ బాలీవుడ్‌లో “జెర్సీ” హిందీ రీమేక్‌తో సహా రెండు సినిమాలు చేసింది, అయితే “సీతా రామం” విడుదలయ్యే వరకు ఆమె తెలుగు ప్రేక్షకులకు తెలియదు. ఆమె అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. యువకులు ఆమెకు అభిమానులుగా మారారు. కొందరు యువకులు ఆమెతో తెలుగు సినిమాలు చేయాలని సోషల్ మీడియాలో ఫిల్మ్ మేకర్స్‌ని ట్యాగ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఆమెకు చాలా డిమాండ్ ఉంది. కాగా మరోవైపు సీతారామం సినిమా తెలుగురాష్ట్రాల్లో సందడి చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 40 కోట్ల క్లబ్ లోకి చేరింది.

  Last Updated: 13 Aug 2022, 02:35 PM IST