తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం (Sri Venkateswara Creations ) నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. నిర్మాత దిల్ రాజు (Dil Raju) కథలను నమ్మి సినిమాలు తీస్తూ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఈ బ్యానర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలే కాదు భారీ డిజాస్టర్లు కూడా పడ్డాయి. అయితే ఈ బ్యానర్‌ను నిలబెట్టేందుకు తెరవెనుక దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి (Shirish)అహర్నిశలు శ్రమిస్తున్నారని అందరికి తెలిసిందే. కాగా ఈ బ్యానర్ లో ఇటీవల రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన గేమ్ ఛేంజర్ (Game Changer ) సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాతో తమ జీవితం కుదేలైందని భావించామని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శిరీష్ వెల్లడించారు.
Ustaad Bhagat Singh : తమ్ముడి సెట్లో అన్నయ్య సందడి
“గేమ్ ఛేంజర్ వల్ల నష్టాలు చవిచూశాం. ఇలాంటి సమయంలో మాకు హీరో రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ ఒక్క కాల్ కూడా చేయలేదు. చిరంజీవి ఈ చిత్రాన్ని సెట్ చేసారు..ఆయన కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడాలేదు. అయితే మేము ఎవరినీ తప్పుపట్టడం లేదు. మేమే ఇష్టపడి సినిమా చేశాం, డబ్బులు పోగొట్టుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్లను మేము వదలలేదు. గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ మీము రోడ్డున పడ్డట్లే అనుకున్నారు..మీము కూడా అలాగే భావించాం. అయితే అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా తిరిగి నిలబెట్టిందని, జీవితం మళ్లీ మారిపోయిందని శిరీష్ తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే మా పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు.
INS Tamal : భారతీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక..నేడు జలప్రవేశం
ఈ సినిమాతో వచ్చిన ఆదాయం వల్ల ‘గేమ్ ఛేంజర్’ నష్టాల్లో సుమారు 70 శాతం వరకు కవరయ్యిందని శిరీష్ పేర్కొన్నారు. “ఈ రోజు మేము తిరిగి నిలవగలిగామంటే, ఆ క్రెడిట్ పూర్తిగా అనిల్ రావిపూడికే చెందుతుంది. ఆయన లేకుంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ స్థాయిలో ఉండేది కాదని నేనెప్పుడూ నమ్ముతాను” అని తెలిపాడు.