Site icon HashtagU Telugu

Siri Hanumanth: సిరి హనుమంతు లేటెస్ట్ లుక్స్ పై భారీగా ట్రోల్స్.. కంటికి ఆపరేషన్ చేయించుకున్నావా అంటూ!

Siri Hanumanth

Siri Hanumanth

బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సిరి హనుమంతు కూడా ఒకరు. మొదటి యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సరి హనుమంతు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటి సంపాదించుకోవడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయింది
ఇక సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సిరి హనుమంతు బిగ్ బాస్ సీజన్ 5 లోకీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join
ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో ఈమె యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లో బయటికి వచ్చే టప్పుడు బోలెడంత నెగిటివిటీని మూట గట్టుకుంది. కాగా సిరి, యూట్యూబర్ శ్రీహాన్ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే నివసిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిరి హనుమంతు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

Also Read: Vijay Devarakonda: ఆ కారణం వల్లే విజయ్ పై నెగిటివిటి పెరిగిందా.. భారీగా ట్రోల్స్!

ఇందులో భాగంగానే తాజాగా సిరి హనుమంతు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. సిరి హనుమంత్ యమా స్టైలిష్ గా ఉన్న ఫోటో షూట్ చేసింది. వైట్ డ్రెస్ లో మెరిసిన సిరి గాగుల్స్ పెట్టుకుని క్రేజీగా ఫోజులు ఇచ్చింది. కొంతమంది నెటిజన్లు సిరి గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా ఉంది అని అభినందిస్తున్నారు. మరికొంతమంది కంటి ఆపరేషన్ చేయించుకున్నావా అంటూ ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. హై హిల్స్ వేసుకొని డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోస్ కీ పోజులు ఇచ్చింది సిరి.

Also Read: RC 16: రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్.. ఏ సినిమాలో అంటే?

Exit mobile version