Site icon HashtagU Telugu

Siri Hanmanth : షారుఖ్ తో ఛాన్స్ అంటే ప్రాంక్ అనుకుందట..!

Siri Feel Shahrukh Jawan Ch

Siri Feel Shahrukh Jawan Ch

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తిరిగి మళీ సూపర్ ఫాం లోకి వచ్చారు. కొన్నేళ్లుగా షారుఖ్ తన స్టామినాకు తగిన హిట్ అందుకోవడంలో వెనకబడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వర్క్ అవుట్ కాలేదు. కానీ ఈ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఇయర్ జనవరిలో పఠాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించిన షారుఖ్ రీసెంట్ గా జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జవాన్ సినిమాను సౌత్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అట్లీ షారుఖ్ తో చేసిన జవాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఇక అతని నెక్స్ట్ సినిమా కూడా పెద్ద స్కేల్ లోనే ఉంటుందని తెలుస్తుంది. షారుఖ్ సినిమాలో తెలుగు యాక్టర్ సిరి హన్మంత్ (Siri Hanmanth) నటించింది. ముందు యూట్యూబ్ సీరీస్ లో ఆ తర్వాత సీరియల్స్ లో నటించిన సిరి బిగ్ బాస్ సీజన్ 5 లో హంగామా చేసింది. మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో సిరి చేసిన హడావిడి తెలిసిందే.

బిగ్ బాస్ తో ఇంకాస్త క్రేజ్ తెచ్చుకున్న సిరి (Siri Hanmanth) షారుఖ్ జవాన్ లో నటించి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో అవకాశం కోసం ఆమెకు ఫోన్ రాగానే అదేదో ప్రాంక్ కాల్ అనుకుందట. షరుఖ్ సినిమాలో తనకు ఛాన్స్ ఏంటని అనుకుందట. కానీ ఆ తర్వాత డైరెక్టర్ అట్లీ తో మాట్లాడాక అసలు విషయం అర్ధమైందని చెప్పింది సిరి.

అంతేకాదు ఒక సీన్ విషయంలో తను సరిగా చెప్పక 7 టేకుల దాకా తీసుకోగా డైరెక్టర్ అట్లీ కాస్త అసంతృప్తిగా ఉండగా షారుఖ్ ఖాన్ తనకు ధైర్యాన్ని చెప్పి ప్రోత్సహించారని ఆయనతో పనిచేసిన ఎక్స్ పీరియన్స్ చాలా బాగుందని ఇదొక లైఫ్ టైం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని అంటుంది సిరి. అవకాశం ఎప్పుడు ఎక్కడ ఎటు నుండైనా రావొచ్చు మనం చేయాల్సిందల్లా ప్రయత్నమే. షారుఖ్ జవాన్ లో సిరి కనిపించిన కొంతసేపైనా షారుఖ్ పక్కన నటించి అలరించింది.

Also Read : Samantha: అవన్నీ రూమర్స్.. సల్మాన్ ఖాన్ తో నేను సినిమా చేయటం లేదు: సమంత