Site icon HashtagU Telugu

Mega Daughter: ‘సింగిల్’ నిహారిక.. వరుస ఫొటోషూట్స్ వెనుక రీజన్ ఇదే!

Niharika

Niharika

భర్త  చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించనప్పటికీ నిహారిక (Niharika) కొణిదెల ప్రస్తుతం సింగిల్ (Single). ఇక వీరిద్దరూ కలిసి ఉండటం లేదనే విషయం సినీ ఇండస్ట్రీ (Tollwood)లో అందరికీ తెలిసిందే. అయితే నిహారిక కొణిదెల ఇప్పుడు తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె క్రమం తప్పకుండా ఫొటోషూట్స్ చేయడం, సోషల్ మీడియా (Socialmedia) లో షేర్ చేయడం మొదలుపెట్టింది.

డిఫరెంట్ యాంగిల్స్ లో ఫొటోలకు ఫోజులిస్తూ (Photoshoot) మళ్లీ పాత నిహారికను గుర్తు చేస్తోంది. గత రెండు వారాల్లో, ఆమె నాలుగు వేర్వేరు ఫోటోషూట్స్ చేసి అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. హాట్ హాట్ ఫోజులతో ఫిదా చేస్తోంది ఈ మెగా డాటర్. నిహారిక ఒకవైపు వెబ్ సిరీస్ ను నిర్మిస్తూనే, మరోవైపు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తోంది. తన చూపులు, అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వరుస ఫోటోషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నిహారిక తన భర్త సోషల్ మీడియా అకౌంట్స్ ను అన్ ఫాలో చేసి రూమర్స్ కు తెరలేపింది. అయితే వీరిద్దరూ అధికారికంగా వీడిపోకపోయినప్పటికీ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ మెగా డాటర్ సింగిల్ గానే ఉంటుందని చెప్పక తప్పదు.

Also Read: Pooja Hegde: ప్రతి రూమర్ కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు : పూజాహెగ్డే

Exit mobile version