Singham Again : బన్నీని వదిలేసి.. చరణ్‌పై దాడికి సిద్దమవుతున్న సింగం..

బన్నీని వదిలేసి చరణ్‌పై దాడికి సిద్దమవుతున్న సింగం. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న 'సింగం ఎగైన్'..

Published By: HashtagU Telugu Desk
Singham Again Postpone From Pushpa 2 Release Date To Game Changer

Singham Again Postpone From Pushpa 2 Release Date To Game Changer

Singham Again : అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సింగం ఎగైన్’. సింగం సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, కరీనా కపూర్, దీపికా పదుకోన్ వంటి స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తోడు అజయ్ దేవగన్ రీసెంట్ గా సైతం, మైదాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకోవడంతో.. సింగం ఎగైన్ పై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో సింగం మేకర్స్ పై పెద్ద భాద్యత పడింది. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్టుని అందుకోవాలి. కాబట్టి మూవీని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ చాలా వరుకే పెండింగ్ ఉందట. అయితే ఈ మూవీని ఈ ఆగష్టు 15న తీసుకు వస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.

ఆ డేట్ కి తీసుకు రావాలని కంగారులో మూవీని తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఇబ్బంది ఎదురుకోవాల్సి వస్తుందని, కాబ్బటి సినిమాని అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించిన తరువాతే, ఆడియన్స్ ముందుకు తీసుకు వెళ్దాం, ఆలస్యం అయినా పర్వాలేదని.. అజయ్ దేవగన్ మేకర్స్ కి చెప్పారట. దీంతో ఈ మూవీని ఆగష్టు నుంచి పోస్టుపోన్ చేస్తున్నారు. దీవాళికి ఈ సినిమాని తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.

కాగా ఆగష్టు 15న పుష్ప 2 కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సింగం రేసు నుంచి తప్పుకోవడంతో.. పుష్పకి లైన్ క్లియర్ అయ్యింది. అయితే బన్నీని వదిలేసిన సింగం చరణ్‌పై దాడికి సిద్దమవుతుంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ దీవాళీకి రావడానికి సిద్దమవుతుంది. ఇప్పుడు సింగం ఆ డేట్ కి వెళ్లడంతో గేమ్ ఛేంజర్ కి పోటీ వచ్చి పడింది. కాగా ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ‘భూల్ భులయ్యా 3’ కూడా రేసులో ఉండబోతుంది. మరి ఈ పోటీని గేమ్ ఛేంజర్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Also read : Devara – Kalki : తెలుగు రాష్ట్రాల్లో దేవర, కల్కి.. థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో..

  Last Updated: 16 Apr 2024, 11:53 AM IST