Sunitha Special Song: సునీత ‘ఇండిపెండెన్స్ డే ’ స్పెషల్ సాంగ్

దేశ ప్రజలు 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - August 15, 2022 / 12:19 PM IST

దేశ ప్రజలు 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతటా జై జవాన్ అనే నినాదాలు మార్మోగుతున్నాయి. అమరవీరులను స్మరిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ గాయని సునీత ఉపద్రస్తా వందేమాతరం గీతాన్ని ఆలపించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అరవింద్ సోవోజీ సంగీతం అందించిన ఈ పాటను సునీత, అద్వితేజ్ రెడ్డి ఆలపించారు. శ్రీ చైతు దర్శకత్వం వహించిన ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ఒరిజినల్స్ కోసం మ్యాంగో మాస్ మీడియా నిర్మించింది. వందేమాతరం గీతం వీక్షకుల్లో దేశభక్తిని పెంపొందిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు కూడా వినండి మరి.