Site icon HashtagU Telugu

Harika Narayan: ఘనంగా సింగర్ హారికా నారాయణ్ పెళ్లి.. నెట్టింట ఫొటోస్ వైరల్!

Mixcollage 18 Mar 2024 09 38 Am 6198

Mixcollage 18 Mar 2024 09 38 Am 6198

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరీ తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అలాగే తీన్మార్ సినిమా హీరోయిన్ కూడా తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది. హారిక నారాయణ్ ప్రియుడు పృథ్వీనాథ్ గురించి ఇటీవలె బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎంగేజ్మెంట్ జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇక ఇప్పుడు హారిక పృథ్వీనాథ్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకలో సింగర్ రేవంత్ సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. హారిక పెళ్లి ఫోటోలు ఇంకా నెట్టింట్లోకి రాలేదు. కానీ సింగర్ రేవంత్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ పోస్ట్‌తో హారిక పెళ్లి ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా వైరల్ గా మారాయి. కాగా ఇటీవల హారికా కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఏడేళ్ల నుంచి మాది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాం.

కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం అంటూ హారిక నారాయణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను వదులుతూ వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అయితే హారిక నారాయణ్ పెళ్లి జరిగిపోయింది. ఇక ఈ పెళ్లి డేట్ గురించి హారిక భర్త పృథ్వీరాజ్ వేసిన పోస్ట్ బాగానే వైరల్ అయింది. సింగర్ పాపకి, సాఫ్ట్ వేర్ బాబుకి పెళ్లి.. తప్పకరండి అంటూ వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది.