వర్ధమాన గాయని ప్రవస్తి – ప్రముఖ గాయని సునీత (Sunitha-Pravasthi Aaradhya) మధ్య సాగుతున్న మాటల యుద్ధం రోజు రోజుకు పిక్ స్టేజ్ కి వెళ్తుంది. ఇటీవల సునీత, నిర్మాత ప్రవీణ ఇచ్చిన వివరణలపై ప్రవస్తి మరోసారి స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె చాలా స్పష్టంగా క్లారిటీ గా తన అభిప్రాయాలను వెల్లడించింది. సునీత గారు ‘రీల్‌లో’ మాత్రమే సానుకూలంగా మాట్లాడారని, అదే నిజ జీవితంలో ప్రవర్స్తిస్తే ఈ వివాదం జరిగేది కాదని తెలిపింది .
Pahalgam Terror Attack : పాకిస్తాన్ కు భారత్ బిగ్ షాక్..ఇక కోలుకోవడం కష్టమే !
ఆమె ఎంపిక చేసుకున్న పాటను పూర్తిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆమెకు అనుమతి నిరాకరించడమే కాకుండా అదే పాటను మరో వ్యక్తికి అవకాశం ఇచ్చిన వ్యవహారమే. అదే విధంగా ‘కన్యాకుమారి’ పాట విషయంలో తనను ముందుగానే తప్పుబట్టడం, పాట మధ్యలో తప్పులు చేసిన వారు ఫైనల్స్‌కు వెళ్లడమంటే న్యాయంగా లేదని ఆమె పేర్కొన్నారు. తనకు మ్యాంగో ఛానల్ ద్వారా అవకాశం నిహాల్ కొండూరి ద్వారా వచ్చిందని, సునీత ఇస్తేనే అన్న వ్యాఖ్యలు తప్పు అని తెలిపింది.
తన జీవిత విషయాల గురించి కూడా ప్రవస్తి బహిరంగంగా వివరించారు. సంగీతం కోసం చదువు మధ్యలో ఆపేసిందని, చిన్ననాటి నుంచే పోటీల్లో పాల్గొంటున్నానని చెప్పారు. తనపై వ్యక్తిగత ద్వేషం లేదని, అయితే వ్యవస్థలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంలో తప్పేముంది? అని నిలదీశారు. కొందరి పేర్లు తానూ ప్రస్తావించకపోయినా తనపై అర్థం చేసుకున్నట్లు తప్పుగా ప్రచారం చేయడం బాధించిందని అన్నారు. మొత్తం మీద సునీత – ప్రవస్తి మధ్య జరుగుతున్న వివాదం ఇండస్ట్రీ లో మరింత చర్చకు దారిస్తుంది.