Singer Mano: సింగర్ మనోకు డాక్టరేట్

గాయకుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు మనో... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గత 35 ఏళ్లుగా తన స్వర మాధూర్యంతో ప్రేక్షకులని రంజింపజేసిన మనో

Singer Mano: గాయకుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు మనో… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గత 35 ఏళ్లుగా తన స్వర మాధూర్యంతో ప్రేక్షకులని రంజింపజేసిన మనోకు రిచ్ మండ్ గాబ్రియోల్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. డాక్టరేట్ అందుకున్న తర్వాత మనో ఆ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

రుకు రుకు రుక్మిణి, ప్రియా ప్రియతమా రాగాలు, ముక్కలా ముక్కబులా లాంటి పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇలాంటి మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ మనో స్వరం నుంచి వచ్చినవే. ఇక ఆయన రజినీకాంత్ సినిమాలకు డబ్బింగ్ అందిస్తారు. రజినీ నటించిన అరుణాచలం, ముత్తు, నరసింహ, శివాజీ మరియు రోబో లాంటి చిత్రాలకు మనో వాయిస్ ప్రధాన ఆకర్షణ. ఈ మధ్య ఆయన బుల్లితెరపై కూడా మెరుస్తున్నాడు. జబర్దస్త్ షోకి జడ్జీగా కొనసాగాడు. అనేక సింగింగ్ షోలకు మనో జడ్జిగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాణించారు.

38 ఏళ్లుగా సంగీతాని కి ఆయన అందిస్తున్న సేవలని గుర్తించిన రిచ్ మాండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది. దీంతో మనో ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన కెరీర్ కు దక్కిన గౌరవం గా భావిస్తున్నానని, నాకు సపోర్ట్ చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మనో స్వస్థలం సత్తెనపల్లి. 14 ఏళ్ల వయసులోనే సంగీతంపై మక్కువతో అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథ్ వద్ద అసిస్టెంట్ గా చేరారు. 1985 నుంచి మనో పాటలు పాడుతున్నారు. మనో కెరీర్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కంగ్రాట్స్.

Read More: Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి