Site icon HashtagU Telugu

Singer Mangli : కొత్త ఇల్లు కట్టుకున్న సింగర్ మంగ్లీ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్..

Singer Mangli New House Opening Ceremony Actress Rohini Shares Photos

Mangli

Singer Mangli : న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో సింగర్ గా దూసుకుపోతుంది. సినిమాల్లో మంగ్లీ పాడిన పాటలు మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలతో పాటు పాపులారిటీ సంపాదించుకుంది.

మరో పక్క ఈవెంట్స్ లో పాల్గొంటూ కూడా బాగానే సంపాదిస్తుంది. తన చెల్లి ఇంద్రావతిని కూడా సింగర్ చేసింది. తాజాగా మంగ్లీ కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంగ్లీకి ఒక ఇల్లు ఉండగా ఇప్పుడు మరో ఇల్లు కట్టుకుంది.

తాజాగా సీరియల్, జబర్దస్త్ నటి రోహిణి మంగ్లీతో, మంగ్లీ చెల్లెలితో కలిసి మంగ్లీ కొత్తింట్లో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొత్త ఇంట్లోకి వెళ్లినందుకు కంగ్రాట్స్ అని తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో నటి హిమజ కూడా ఉంది. ఈ ఫొటోలతో ఇటీవలే మంగ్లీ కొత్త ఇల్లు గృహప్రవేశం అయినట్టు, దీనికి పలువురు సెలబ్రిటీలు హాజరయినట్టు సమాచారం.

రోహిణి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవ్వగా మంగ్లీ ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇటీవలే మంగ్లీ ఓ హోలీ ఈవెంట్ లో పాల్గొని బాగా వైరల్ అయింది.

Also Read : Amitabh Bachchan : షారుఖ్ ని మించి ట్యాక్స్ కట్టిన అమితాబ్.. వామ్మో అన్ని కోట్లా?