Site icon HashtagU Telugu

Singer Kalpana: ఆక్సిజ‌న్‌తో సింగర్ కల్పనకు ట్రీట్మెంట్..!

Singer Kalpana

Singer Kalpana

Singer Kalpana: ప్ర‌ముఖ‌ సింగర్ కల్పన (Singer Kalpana) ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. ఆక్సిజ‌న్‌తో సింగర్ కల్పనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే సింగ‌ర్ క‌ల్ప‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం నిద్ర మాత్రలు వేసుకొని సింగర్ కల్పన ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే మొదట ఆత్మహత్యయత్నంగా పోలీసులు అనుమానించిన విష‌యం తెలిసిందే. కల్పనతో పాటు భర్త ప్రసాద్ ప్రభాకర్, కూతురు దయల స్టేట్మెంట్ ఆధారంగా ఆత్మహత్యాయత్నం కాదని పోలీసులు నిర్దారించారు.

కూతురు విషయంలో మనస్థాపానికి గురై నిద్రమాత్రలు వేసుకున్నట్లు పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు. రెండు రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సింగ‌ర్ క‌ల్ప‌న‌ చికిత్స తీసుకుంటున్నారు. కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కేరళలోని వారి నివాసానికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల మరికొన్ని రోజులు ఆక్సిజన్ ఇస్తూ చికిత్స అందించాలని వైద్యులు పేర్కొన్నారు. ఒకటి, రెండు రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఆసుపత్రి నుండి కల్పనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ అనంతరం కల్పనను కేరళలోని వారి నివాసానికి క‌ల్ప‌న కుటుంబ స‌భ్యులు తీసుకెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read: Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

సింగ‌ర్ క‌ల్ప‌న నిద్ర మాత్ర‌లు వేసుకోవ‌డంతో టాలీవుడ్‌లో స‌ర్వ‌త్రా చ‌ర్చ కొన‌సాగుతోంది. అయితే తొలుత క‌ల్ప‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నం అని అంద‌రూ భావించారు. కానీ త‌న‌కు, కూతురు మ‌ధ్య జ‌రిగిన చిన్న ఇష్యూ వ‌ల‌న నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డంతో నిద్ర‌మాత్ర‌లు వేసుకున్నారు క‌ల్ప‌న‌. అయినా స‌రే నిద్ర ప‌ట్ట‌కపోవడంతో డోస్‌కు మించి పిల్స్ ఉప‌యోగించ‌టంతో క‌ల్ప‌న స్పృహా కోల్పోయారు. స్పృహా కోల్పోయిన క‌ల్ప‌న‌ను స్థానికులు పోలీసులు సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కల్ప‌న కూత‌రు సైతం స్పందించారు. త‌న‌కు, త‌ల్లికి ఎటువంటి గొడ‌వ జ‌ర‌గ‌లేద‌ని, మోతాదుకు మించి నిద్ర‌మాత్ర‌లు వేసుకోవ‌డంతో ఆస్ప‌త్రిలో జాయిన్ చేయించిన‌ట్లు ఆమె వివ‌రించారు.