తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నం (Suicide attempts) చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న కల్పన, తాజాగా నిద్ర మాత్రలు(Sleeping Pills) మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్స్ తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటి?
కల్పన ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలా? లేక కెరీర్ ఒత్తిళ్లా? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాధానం లేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
సింగర్ కల్పన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అనేక హిట్ పాటలు పాడారు. చిన్నతనం నుంచే సంగీతాన్ని ప్రేమించిన ఆమె, టాలీవుడ్‌లో తన గాత్ర మాధుర్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాడిన పాటలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కాలంతో పాటు మారుతున్న సంగీత ప్రపంచంలో ఆమెను కొత్త సవాళ్లు ఎదుర్కొనేలా చేశాయి.
కల్పన ఆత్మహత్య కు ట్రై చేసిందనే వార్త తెలిసి సినీ ప్రముఖులు , అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సెలబ్రిటీల జీవితాల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత జీవితానికి ప్రభావం చూపడం సాధారణంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.