తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పనా నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. వెంటనే ఆమెను పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. అయితే కల్పనా సూసైడ్ అటెంప్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేనిది ఆమె ఫ్యామిలీ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం మీడియా ముందుకు రావడం కూడా జరిగింది. ఇక ఆమె బెడ్ పై ఉన్నప్పుడు రకరకాల వార్తలు వినిపించడంతో ఆ తర్వాత బయటకు వచ్చిన కల్పన ఒక వీడియోని కూడా విడుదల చేసింది.
తన భర్తతో అలాగే తన కూతురుతో ఎలాంటి గొడవలు లేవు అని ఆమె వీడియో ద్వారా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో అలాగే వస్తూ ఉండడంతో తాజాగా ఆమె తెలంగాన మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లను ఆపాలని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. నిజ నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ను కోరారు
. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. అంతేకాకుండా తన ప్రైవేటు వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తూ తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కల్పన ఫిర్యాదుపై మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించింది.
అసత్య ప్రచారాలు చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని ఆమెకు భరోసా కల్పించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పటికైనా కల్పనా మీద చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపుతారేమో చూడాలి మరి.