Site icon HashtagU Telugu

Singer Kalpana : కల్పన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..!

Singer Kalpana Health Condi

Singer Kalpana Health Condi

సినీ గాయని కల్పన (Singer Kalpana ) ఆరోగ్య పరిస్థితి (Health Condition) నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. నిన్న ఆమె ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. వెంటనే ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చినట్లు డాక్టర్లు వెల్లడించారు. పరిస్థితి మెరుగుపడుతున్నట్లు పేర్కొంటూ, మరికొద్ది రోజులు వైద్య పర్యవేక్షణలోనే ఉంచుతామని తెలిపారు.

Mayuri Kango : ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్

కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె వ్యక్తిగత జీవితంలో నెలకొన్న సమస్యలే దీని వెనుక ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె రెండో భర్త ప్రసాద్‌పై అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రసాద్‌ను విచారిస్తున్నారు. అతని పాత్రపై స్పష్టత కోసం మరికొన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

Lady Superstar : ‘నన్ను’ ఆలా పిలవొద్దు – నయనతార రిక్వెస్ట్

అంతేకాకుండా కల్పన ఇంట్లో పోలీసులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న ఆధారాలను సేకరించి, వాటిని పరిశీలిస్తున్నారు. గాయని కల్పన గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. ఆమెకు కుటుంబసభ్యులు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఇక తనపై వస్తున్న అనుమానాలను ఖండిస్తూ ప్రసాద్ పోలీసులు ఇచ్చిన వివరాల్లో తాను రెండు రోజుల క్రితం పనిమీద బయటకు వెళ్లినట్లు పేర్కొన్నారు. తన గైర్హాజరీలో ఈ ఘటన జరగడం విచారకరమని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.