Site icon HashtagU Telugu

Actor Simbu OG : పవన్ సినిమాలో పాట పాడిన శింబు..

Simbu Og

Simbu Og

Simbu sing a song in Pawan movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఈరోజు ఉదయం మంగళగిరి లో వేసిన ప్రత్యేక సెట్ లో హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veera Mallu ) షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే మిగతా సినిమాలను సైతం పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. ఇదిలా ఉంటె..పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న ‘OG ‘ మూవీ లో నటుడు శింబు ఓ సాంగ్ ను పాడినట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో శింబు (Simbu ) పాట (sing a song) పాడుతారు అనే విషయం కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ఎందుకంటే… ఏపీ, తెలంగాణలో ఇటీవల తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల కోసం శింబు విరాళం ప్రకటించారు. ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్) సినిమాలో సాంగ్ పాడినందుకు గాను రెమ్యూనరేషన్ ఇవ్వబోతే ఆయన ససేమిరా వద్దని చెప్పేశారు‌. అక్కడికి నిర్మాతలు బలవంతం చేయడంతో ఆ డబ్బులను తెలుగు ప్రజల కోసమే విరాళంగా ఇచ్చేసి తన మంచి మనసు చాటుకున్నారు శింబు.

గతంలో శింబు ఎన్టీఆర్ ‘బాద్‌షా’, మంచు మనోజ్ ‘నేను మీకు తెలుసా’, ‘పోటుగాడు’, రామ్ ‘ది వారియర్’ సహా పలు చిత్రాల్లో పాటలు పాడాడు. ఇవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు పవన్ సాంగ్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ‘OG’ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : Jani Master Issue : సుకుమార్ వల్లే జానీ జైలుపాలయ్యాడా..? నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు