Simba is Coming : సింబా వచ్చేస్తున్నాడు.. మోక్షజ్ఞ మూవీ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ..!

Simba is Coming Prashanth Varma Mokshagna Movie Annoucement సింబాలిక్ గా బాలయ్య మొఫాసా సింహం అయితే అతని కొడుకు మోక్షజ్ఞ సింబాగా చెబుతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హనుమాన్ మొదటిది కాగా మోక్షజ్ఞ

Published By: HashtagU Telugu Desk
Simba Is Coming Prashanth Varma Mokshagna Movie Annoucement

Simba Is Coming Prashanth Varma Mokshagna Movie Annoucement

సింబా వచ్చేస్తున్నాడు.. నందమూరి ఫ్యామిలీ నుంచి నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్నట్టుగానే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుంది. అ! నుంచి తన ప్రతి సినిమాతో ప్రేక్షకులనే కాదు తోటి దర్శకులను సర్ ప్రైజ్ చేస్తూ వచ్చిన ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ సూపర్ హిట్ అందుకున్నాడు.

లెగసీని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం..

మోక్షజ్ఞ తో ప్రశాంత్ వర్మ సినిమా కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తున్నా అఫీషియల్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ప్రశాంత్ వర్మ రీసెంట్ గా సింబా ఈజ్ కమింగ్ (Simbaiscoming) అంటూ ఒక కామెంట్ పెట్టగా అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా సింబా ఈజ్ కమింగ్ లెగసీని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అంటూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ రెండో ప్రాజెక్ట్ గా సింబా ఈజ్ కమింగ్ అని పెట్టాడు. Prashanth Varma Mokshagna Movie

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్..

సింబాలిక్ గా బాలయ్య మొఫాసా సింహం అయితే అతని కొడుకు మోక్షజ్ఞ సింబాగా చెబుతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ( PVCU 2) లో హనుమాన్ మొదటిది కాగా మోక్షజ్ఞ తో సినిమా రెండోదని తెలుస్తుంది. అంతేకాదు మోక్షజ్ఞ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని టాక్.

ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఐతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా దానికి సంబందించిన మరో క్రేజీ అప్డేట్ ని శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వస్తుందని ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చాడు. నందమూరి వారసుడి తెరంగేట్రానికి భారీ ప్లానింగ్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. తప్పకుండా మోక్షజ్ఞ మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

  Last Updated: 05 Sep 2024, 03:49 PM IST