దక్షిణాది సినీ చరిత్రలో సిల్క్ స్మిత (Silk Smitha ) ఓ సంచలనం. 40 ఏళ్ల వెనక్కు వెళ్తే..ఆ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే సిల్క్ స్మిత సాంగ్ వుండల్సిందే. తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ ఇలా అన్ని ఇండస్ట్రీ లలో ఐటెం సాంగ్స్ తో కుర్రకారులో ఊపు తెప్పించిన ఐటెం బాంబ్. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. మత్తెక్కించే కళ్లు.. అందచందాలతో కుర్రాడి దగ్గరి నుండి ముసలాడి వరకు అందరితో బావల సయ్య అంటూ సై ఆడించింది. సిల్క్ డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురుచూసేవారంటే అర్ధం చేసుకోవాలి అమ్మడి రేంజ్ ఏంటి అనేది. స్టార్ హీరోహీరోయిన్లకు మించి పారితోషికం తీసుకున్న ఏకైక నటి ఆమె. అయితే తెరపై అందచందాలతో ప్రేక్షకులకు కవ్వించిన సిల్క్ .. జీవితం మాత్రం కన్నీటి చెర. చిన్న వయసులోనే పెళ్లి.. ఇంట్లో కష్టాల నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మేకప్ ఆర్టిస్ట్ అయ్యింది. ఆ తర్వాత నటిగా మారింది. హీరోయిన్ కావాలనుకుంది కానీ కుదరలేదు. తక్కువ సమయంలోనే ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి కేవలం 36 ఏళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ప్రేమ, నమ్మకం చేతిలో మోసపోయి చివరకు ఒంటరితనంతో పోరాడి సెప్టెంబరు 23, 1996 లో ఆత్మహత్య (Silk Smitha Suicide) చేసుకుంది. ఆమె ఐటమ్ సాంగ్ ఉంటే చాలు యువత ఎగబడి థియేటర్లకు వచ్చే పరిస్థితి 80వ దశకంలో నడిచింది. గుర్తింపు తెచ్చిన వండిచక్రం మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బోల్డ్ క్యారెక్టర్లతో 17ఏళ్ల కెరీర్లో 450 సినిమాలు చేశారామె. అయితే ప్రేమలో, నిర్మాతగా వైఫల్యం చెందడంతో నిజ జీవితంలో కుంగిపోయింది.
పెళ్లి తర్వాత ఆమె జీవితం దుర్భరంగా మారింది
సిల్క్ స్మిత అసలు పేరు..విజయలక్ష్మి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడేది. ఆ కారణంతో నాలుగు తరగతిలోనే సిల్క్ స్మిత చదువు మానేయాల్సి వచ్చింది. అప్పుడామె వయసు పదేళ్లు మాత్రమే. స్కూల్ మానేసిన తర్వాత సిల్క్ స్మిత ఇంటి పనుల్లో తల్లికి సాయం చేయడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులు.. ఆమెను అడగకుండానే అపరిచితుడితో వివాహం జరిపించారు. సిల్క్ స్మితకు 14 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఆమె జీవితం దుర్భరంగా మారింది. భర్తతో పాటు అత్తామామలు నిత్యం వేధించేవారు. అత్తింటి వేధింపులు తాళలేక ఇంటి నుంచి పారిపోయి డబ్బు సంపాదన కోసం సినీ ప్రపంచాన్ని ఆశ్రయించారు సిల్క్ స్మిత. మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత తన పేరును మార్చుకుని విజయలక్ష్మి నుంచి సిల్క్ స్మితగా మారింది.
సిల్క్ స్మిత తన కష్టసుఖాలను ఎవరితోనూ పెద్దగా పంచుకునే వారు కాదు
1979లో ‘వందికకారం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సిల్క్ స్మిత. ఆ తర్వాత 80వ దశకం నుంచి 90వ దశకం వరకు తెలుగుతో పాటు మలయాళం, తమిళం సినిమాల్లో దాదాపు దశాబ్దంన్నర పాటు ఎన్నో సినిమాలు చేశారు. టాప్ డ్యాన్సర్ గా రాణించి అందరినీ ఆకర్షించింది. స్మిత 1979-96 మధ్య కాలంలో 400కు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె డాన్స్ ఎంత ఫేమస్ అంటే.. లీడ్ రోల్ కాకపోయినా.. సినిమా పోస్టర్లలో ఆమె ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. 80వ దశకంలో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్లో ఖచ్చితంగా సిల్మ్ స్మిత పాటలు పెట్టేవారు. ఆమె ఐటమ్ సాంగ్స్ వల్లే అప్పట్లో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. సిల్క్ స్మిత తన కష్టసుఖాలను ఎవరితోనూ పెద్దగా పంచుకునే వారు కాదు. అంతేకాదు ముక్కుసూటిగానూ మాట్లాడేవారని అంటారు. సెట్స్‌కి సమయానికి వెళ్లేవారు. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఆమెలో ఎంతో ఉండేది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ తన పాత స్నేహితుల కోసం సమయం కేటాయించేది.
సిల్క్ స్మిత అంత్యక్రియలు ఒక అనాథకు జరిగినట్లు జరిగాయి
పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఫెయిల్యూర్ రిలేషన్ షిప్స్ తర్వాత సిల్క్ స్మితకి నటనపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి.. సినీ పరిశ్రమలో పతనం తర్వాత.. ఆమె ఒంటరైంది. బంధువులు, స్నేహితులు ఎవరూ ఆమెను పట్టించుకోలే. ఈ క్రమంలోనే 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం రిపోర్టులో అతిగా మద్యం సేవించడం వల్లే ఆమె మృతి చెందిందని తేలింది. ఐతే ఇప్పటికీ ఆమె మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. కోట్ల మంది ఆరాధ్య నటిగా వెలుగొందిన సిల్క్ స్మిత అంత్యక్రియలు ఒక అనాథకు జరిగినట్లు జరిగాయి. ఆమెకు గవర్నమెంట్ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఆసుపత్రి సిబ్బందే అంత్యక్రియలు చేశారని సమాచారం. ఒక్క అర్జున్ సర్జా మాత్రమే సిల్క్ స్మిత అంత్యక్రియలకు హాజరయ్యాడట.
Read Also : Chiru-Pawan : అక్కడ తమ్ముడు..ఇక్కడ అన్నయ్య..రికార్డ్స్ తిరగ రాస్తున్నారు