Site icon HashtagU Telugu

Puri Jagannadh : పూరీనే కాదన్నా యంగ్ హీరో..?

Puri Reject

Puri Reject

డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh)..ఈ పేరు చెపితే ఇండస్ట్రీ (Tollywood) లో సంచలనమే..పూరి చేతిలో పడితే హీరోల జతకమే మారిపొద్దనే రికార్డు ఉంది. రవితేజ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ ఇలా ఎంతోమందికి భారీ హిట్లు ఇచ్చి వారి ట్రాక్ రికార్డు లో అద్భుతమైన చిత్రాలు ఇచ్చాడు. అలాంటి పూరి తో ఇప్పుడు సినిమాలు చేసేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు. గత కొంతకాలంగా పూరి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఆ మధ్య ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్ తో మళ్లీ పూరి ట్రాక్ లోకి వచ్చాడని భావించారు. వెంటనే విజయ్ దేవర కొండ తో లైగర్ చేసాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత చాల గ్యాప్ తీసుకొని రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేసాడు. ఇది కూడా డిజాస్టర్ కావడం తో..ఇప్పుడు పూరి తో ఎవరు సినిమాలు చేస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే పూరీ.. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కు ఓ కథ వినిపించాడట. డీజే టిల్లు హిట్ తో సిద్దు జాతకం మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం చేతిలో నాల్గు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఈ తరుణంలోనే సిద్దు కోసం పూరి కథను రాసి తీసుకెళ్లగా.. దానిని రిజెక్ట్ చేశాడని టాక్ నడుస్తోంది. అయితే సిద్దు కథ నచ్చక రిజెక్ట్ చేశాడా.. ? లేక పూరీ ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అని రిజెక్ట్ చేశాడా.. ? లేక చేతిలో ఎక్కువ సినిమాలు ఉన్నాయని వద్దు అన్నాడా.. ? అనేది తెలియదు కానీ, సిద్దు రిజెక్ట్ చేసి పెద్ద తప్పే చేశాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ కథను మరో హీరోకు ఏమైనా చెపుతాడా..పూరి అనేది చూడాలి. గతంలో పవన్ కూడా ఇలాగే పూరి కథలు రిజక్ట్ చేయడం..ఆ తర్వాత అదే కథలు వీరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. మరి ఇప్పుడు సిద్దు కథ కూడా అలాగే అవుతుందా అనేది చూడాలి.

Read Also : Gautam Gambhir: విరాట్ కోహ్లీపై గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు