Siddu Jonnalagadda : టిల్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..కొత్త మూవీ టైటిల్ వచ్చేసిందోచ్ ..!!

డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda ) పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా తాలూకా అప్డేట్ ను తెలియజేసి అభిమానుల్లో సంతోషం నింపారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న SVCC37 సినిమా టైటిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘జాక్.. కొంచెం క్రాక్’ ( JACK – Konchem Krack) పేరును ఖరారు చేసినట్లు తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసారు. […]

Published By: HashtagU Telugu Desk
Jack Movie

Jack Movie

డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda ) పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా తాలూకా అప్డేట్ ను తెలియజేసి అభిమానుల్లో సంతోషం నింపారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న SVCC37 సినిమా టైటిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘జాక్.. కొంచెం క్రాక్’ ( JACK – Konchem Krack) పేరును ఖరారు చేసినట్లు తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసారు. ఈ మూవీలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య సిద్ధూకి జోడీగా నటిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

డీజే టిల్లు కు ముందు ‘గుంటూరు టాకీస్’, ‘కల్కి’ చిత్రాల్లో పాత్రలు సిద్దు కు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాధ వినుమా’ తో హీరోగా సక్సెస్ అయ్యారు. కానీ డీజే టిల్లు మాత్రం అసలైన స్టార్ ను చేసింది. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు కు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడట. అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ చేసి సక్సెస్ అందుకున్న భాస్కర్..ఈసారి కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉండడం తో వైష్ణవి ని ఎంపిక చేసినట్లు చెపుతున్నారు.

Read Also : 95 Years Graduate : 95 ఏళ్ల ఏజ్‌లో పీజీ చేశాడు.. నెక్ట్స్ టార్గెట్ పీహెచ్‌డీ

  Last Updated: 07 Feb 2024, 01:15 PM IST