Siddhu మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bacchan). ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మూవీ అందించారు. ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టారు. ఐతే ఈ సినిమాలో రవితేజ (Raviteja)తో పాటు స్టార్ బోయ్ అదే డీజే టిల్లు కూడా సందడి చేస్తాడన్న విషయం తెలిసిందే.
సినిమాలో ఒక చిన్న క్యామియోలో సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సీన్స్ షూట్ చేయగా సినిమాలో ఆ సీన్స్ మాస్ ఆడియన్స్ ని మరింత మెప్పిస్తాయని అంటున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు మిస్టర్ బచ్చన్ లో తన మార్క్ క్యామియోతో మెప్పిస్తాడని టాక్. సిద్ధు ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్ అంతా మోత మోగిపోయేలా ఉంటుందని అంటున్నారు.
Also Read : Nani : నాని సినిమా రెమ్యునరేషన్ వల్లే ఆగిపోయిందా..?
ఓ పక్క రవితేజ మాస్ మేనియా.. ఇటు సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఈ కలయికతో తెర మీద మాస్ రచ్చ కన్ఫర్మ్ అంటున్నారు ఆడియన్స్. రవితేజ ను స్పూర్తిగా తీసుకునే ఇండస్ట్రీకు వచ్చిన వారిలో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. అందుకే ఆ సినిమాలో క్యామియో రోల్ అడగ్గానే మరో మాట మాట్లాడకుండా చేశాడు.
ఇక సిద్ధు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ సినిమా చేస్తున్న అతను తెలుసు కదా సినిమాను కూడా చేస్తున్నాడు . తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ వాడుకుంటూ యువ హీరోల్లో తన సత్తా కూడా చాటుతున్నాడు సిద్ధు. కచ్చితంగా అతను చేసిన ఈ క్యామియో మాస్ రాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే టీజర్ తో మిస్టర్ బచ్చన్ అదరగొడుతుండగా సినిమా మాస్ ఫీస్ట్ పక్కా అని చెబుతున్నారు.