Siddhu Jonnalagadda : డీజే టిల్లుతో యూత్ ఆడియన్స్ ని మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ తో 100 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టాడు. సిద్ధు కూడా ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో కాగా అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు వరుస ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు తెలుసు కదా, జాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం తో కూడా ఒక సినిమా డిస్కషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
పరశురాం డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఒకటి చర్చల్లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే మాత్రం సిద్ధు ఖాతాలో ఒక మంచి సినిమా పడినట్టే లెక్క. మహేష్ తో సర్కారు వారి పాట తర్వాత విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు పరశురాం. ఐతే అది మిస్ ఫైర్ అవ్వడంతో ఈసారి పర్ఫెక్ట్ స్టోరీతో వస్తున్నాడట.
యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధు ఇమేజ్ కి తగిన కథతో పరశురాం కలవడం కథా చర్చలు జరపడం జరిగిందట. సిద్ధు జొన్నలగడ్డ తో గీతా గోవిందం లాంటి సినిమా తీస్తే అతన్ని కూడా స్టార్ రేంజ్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సిద్ధు కూడా గట్టి ఫోకస్ తోనే మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు.
సిద్ధు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోగా ఇప్పుడు అతని నుంచి సినిమా అంటే మంచి అంచనాలు ఉంటాయి. దానికి తగినట్టుగానే సినిమాలు అందిస్తే మాత్రం అతని కెరీర్ చాలా గొప్పగా మారుతుందని చెప్పొచ్చు.
Also Read : Trivikram : మాస్ రాజాతో త్రివిక్రం.. ఇదేం ట్విస్ట్ సామి..!