Tillu Boy మాస్ మహరాజ్ రవితేజ నుంచి ఆయన ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సర్ ప్రైజ్ క్యామియోలో యువ నటుడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నాడని తెలిసిందే. ఈమధ్యనే అతని పార్ట్ షూట్ కంప్లీట్ చేశారని తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ లో సిద్ధు రోల్ ఏంటి అతను ఎంతసేపు కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్ధు సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లో అతని క్యామియో పై కూడా అదిరిపోయే బజ్ ఏర్పడింది. సిద్ధు బోయ్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో క్లైమాక్స్ 2, 3 నిమిషాల్లో కనిపిస్తాడట. అతని డ్యురేషన్ తక్కువే కానీ ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.
Also Read : Priya Bhavani Shankar : నాకో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అతనితో డేటింగ్ లో ఉన్నా..!
రవితేజతో పాటు సిద్ధు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ కి ఒక రేంజ్ ట్రీట్ అందుతుందని. హరీష్ శంకర్ ఈ సీన్ ని బాగా రాశారని తెలుస్తుంది. హరీష్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. తప్పకుండా మిస్టర్ బచ్చన్ ఒక పక్కా పైసా వసూల్ కమర్షియల్ సినిమాగా కనిపిస్తుంది. మరి ఆగష్టు 15కి మాస్ రాజాతో పాటు టిల్లు ఫ్యాన్స్ కూడా అతని క్యామియో రోల్ కి సర్ ప్రైజ్ అవుతారేమో చూడాలి.
ఇక సిద్ధు జొన్నలగడ్డ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ చేస్తున్న సిద్ధు నీరజ కోనా డైరెక్షన్ లో తెలుసు కదా సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.