Site icon HashtagU Telugu

Tillu Square Runtime Shock : రెండు గంటల్లోపే టిల్లు స్క్వేర్.. సిద్ధు స్కెచ్ అదిరిందిగా..!

Siddhu Jonnalagadda Tillu Square Runtime Shock

Siddhu Jonnalagadda Tillu Square Runtime Shock

Tillu Square Runtime Shock డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఆ సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్లాన్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం రెండేళ్లు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు. సీక్వెల్ కి మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా మరో 3 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.

సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమ్మడి గ్లామర్ డోస్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ తోనే యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కించగా తప్పకుండా టిల్లు స్క్వేర్ సెన్సేషన్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ఈ సినిమా రన్ టైం విషయంలో కూడా మేకర్స్ పర్ఫెక్ట్ స్కెచ్ వేశారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు 3 గంటల దాకా సినిమా తీస్తున్నారు. కానీ టిల్లు స్క్వేర్ సినిమా కేవలం 1 గంట 58 నిమిషాలు మాత్రమే సినిమా చూపిస్తున్నారట.

అంటే టిల్లు స్క్వేర్ సినిమా రెండు గంటల లోపే రాబోతుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ సూపర్ హిట్ అయితే మాత్రం సినిమా నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్టే అని చెప్పొచ్చు.

Also Read : Family Star Madhuramu Kada Song : మధురము కదా సాంగ్.. ఫ్యామిలీ స్టార్ చిన్నగా ఎక్కించేస్తున్నాడు..!