Siddhu Jonnalagadda: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన సిద్దు జొన్నలగడ్డ.. హెల్మెంట్ లేకపోతే నేను లేను అంటూ?

టాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా సిద్దు జొన్నలగడ్డ తెలుగులో గుంటూరు టా

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 11:00 AM IST

టాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా సిద్దు జొన్నలగడ్డ తెలుగులో గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో హీరో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా రాధిక అనే డైలాగ్ తో భారీగా ఫేమస్ అయ్యారు సిద్దు జొన్నలగడ్డ.

ప్రస్తుతం హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిద్దు తన జీవితంలో ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్పకొచ్చారు. యూత్ ఐకాన్ తో యువతలో బైక్ యాక్సిడెంట్స్ పై అవగాహన తెప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే రోడ్డు భద్రతపై జరిగిన అవగాహన కార్యక్రమంలో సిద్దు అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిద్దు తన లైఫ్ లో జరిగిన కొన్ని ప్రమాదకర విషయాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.. నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో పరీక్ష రాసి బైక్ పై వస్తుండగా, ఫ్రెండ్ సిద్దు బైక్ ని ఓవర్ టేక్ చేస్తూ యాక్సిడెంట్ గురయ్యాను.

దాంతో రెండు బైక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఆ సమయంలో నా తలకి ఉన్న హెల్మెట్ కూడా పగిలిపోయింది. కానీ దాని వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఆ తరువాత కొన్నేళ్ల క్రిందట రాజమండ్రి నుంచి కారులో వస్తున్న సమయంలో ఒక బైక్ అతను సడన్ గా అడ్డురావడంతో.. సిద్దు కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ కొట్టాడట. దీంతో కారు స్కిడ్ అయ్యి ఉల్టా పడిపోయిందట. ఆ సమయంలో కూడా గట్టి ప్రమాదమే జరగాల్సి ఉందట. కానీ అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోవడంతో చిన్ని చిన్ని గాయాలతో ప్రమాదం నుంచి బయట పడినట్లు చెప్పుకొచ్చారు.

 

నా లైఫ్ లో నాకు రెండు ఛాన్సులు వచ్చాయని, అందరి జీవితాల్లో ఇలా సెకండ్ ఛాన్స్ ఉండకపోవచ్చని, అందుకనే హెల్మెట్, సీట్ బెల్ట్ అనేవి పాటించండి అంటూ సిద్దు చెప్పుకొచ్చారు. ఆ రోజు కనుక సీల్డ్ బెల్ట్ అలాగే హెల్మెట్ ధరించకపోయి ఉంటే ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పకొచ్చారు సిద్దు జొన్నలగడ్డ. సిద్దు మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి సిద్దు రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.