Siddhu Jonnalagadda : చిరంజీవి సినిమాలో ఆఫర్‌కి నో చెప్పిన డీజే టిల్లు??

డీజే టిల్లు తర్వాత సిద్ధుకి అనేక ఆఫర్స్ వచ్చినా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సిద్ధు డీజే టిల్లు 2 సినిమా చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Siddhu Jonnalagadda says no to Megastar Chiranjeevi Movie

Siddhu Jonnalagadda says no to Megastar Chiranjeevi Movie

సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సిద్ధుకి గుంటూరు టాకీస్(Guntur Talkies) తో గుర్తింపు వచ్చింది. కరోనా సమయంలో కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా సినిమాలతోటి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. డీజే టిల్లు(DJ  Tillu) సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత సిద్దు ఫేట్ మారిపోయింది.

డీజే టిల్లు తర్వాత సిద్ధుకి అనేక ఆఫర్స్ వచ్చినా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సిద్ధు డీజే టిల్లు 2 సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా సిద్ధుకి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలో ఆఫర్ వస్తే నో చెప్పినట్టు సమాచారం. మెగాస్టార్(Mega Star) త్వరలో భోళా శంకర్(Bhola Shankar) సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాని బంగార్రాజు(Bangarraju) ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం చిరంజీవితో కలిసి నటించడానికి ఓ యువ హీరో కోసం చూడగా సిద్ధు అయితే బాగుంటుందని అప్రోచ్ అవ్వగా నో చెప్పినట్టు తెలుస్తుంది. చిరంజీవి సినిమాలో చేస్తే జనాలంతా చిరంజీవినే చూస్తారు. తన పాత్ర ఎంత బాగున్నా మెగాస్టార్ పక్కన మనం కనపడం అని చెప్పినట్టు తెలుస్తుంది.

మెగాస్టార్ పక్కన చేయాలని చాలామంది కలలు కంటారు. అసలే ఇటీవల చిరంజీవి తన సినిమాల్లో చాలా మందికి కొత్తవాళ్ళకి, నార్మల్ ఆర్టిస్టులకి ఛాన్సులు ఇస్తున్నారు. తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్న వాళ్లందరికీ తన సినిమాలో ఏదో ఒక ఛాన్స్ ఇస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు సిద్ధుకి ఈ ఆఫర్ వస్తే అతను నో చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి నిజంగానే సిద్ధు మెగాస్టార్ సినిమాకి నో చెప్పాడా? అసలు ఏ సినిమా? ఏ పాత్రకు నో చెప్పాడు అని నెటిజన్లు తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

 

Also Read : Nani30 Title: నాని కొత్త సినిమా టైటిల్ ఇదే.. మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ తో!

  Last Updated: 13 Jul 2023, 09:46 PM IST