Tillu Square : రెండేళ్ల క్రితం చెప్పిన మాటని సాధించిన సిద్ధూ.. అట్లుంటది టిల్లుతోని..

రెండేళ్ల క్రితం చెప్పిన మాటని సాధించి చూపించిన సిద్ధూ జొన్నలగడ్డ. అట్లుంటది మరి టిల్లుతోని..

Published By: HashtagU Telugu Desk
Siddhu Jonnalagadda Make His Words True With Tillu Sqaure Movie Collections

Siddhu Jonnalagadda Make His Words True With Tillu Sqaure Movie Collections

Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ పేరు డీజే టిల్లు సినిమా ముందు వరకు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఆ సినిమాలో టిల్లుగా సిద్ధూ మోగించిన డీజే.. టాలీవుడ్ అంతా తన పేరు వినిపించేలా చేసింది. ‘నన్ను ఎవరు లేపనవసరం లేదు. నన్ను నేనే లేపుకుంటా’ అని విశ్వక్ సేన్ చెప్పిన మాటలు.. సిద్ధూ జొన్నలగడ్డకి బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే, తన సినిమాలకు తాను రచయితగా మారినప్పుడు నుంచే తన కెరీర్ పెరుగుతూ వెళ్ళింది.

డీజే టిల్లు సినిమాకి కథని, డైలాగ్స్ ని సిద్ధునే రాసారు. మూవీలోని ఆ డైలాగ్స్ ఎంతటి ఫేమస్ అయ్యాయంటే.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ఆ డైలాగ్స్ చెప్పేంత. డీజే టిల్లుతో 30 కోట్లు వసూళ్లు అందుకొని కెరీర్ హైయెస్ట్ చూసిన సిద్ధూ.. ఆ సమయంలోనే ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

2022 ఫిబ్రవరి 5న ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడుతూ.. “వచ్చే మూడేళ్ళలో నేను 100 కోట్లు అందుకునే స్టార్ హీరోగా ఎదగాలి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ మాటల్ని ఇప్పుడు నిజం చేసుకున్నారు. టిల్లు స్క్వేర్ సినిమాతో 100 కోట్ల మార్క్ ని అందుకున్నారు. ఈ సినిమా 101.4 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అప్పటి కామెంట్స్ ని గుర్తు చేస్తూ.. “సిద్ధూ తాను చెప్పిన మాటల్ని నిజం చేసుకున్నాడు. ఇలా సాధించడం అందరికి కుదరదు. కానీ సిద్ధూ సాధించి చూపించాడు” అంటూ అందరూ అభినందిస్తున్నారు.

కాగా ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం రేపు ఏప్రిల్ 8న ఓ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా ఈ సక్సెస్ పార్టీ ఈవెంట్ లో కనిపించనున్నారని సమాచారం.

Also read : Ram Charan : టిల్లు గాడిని చూస్తే చాలా గర్వంగా ఉందంటున్న రామ్ చరణ్.. పోస్ట్ వైరల్

  Last Updated: 07 Apr 2024, 11:53 AM IST