Siddhu Jonnalagadda : DJ టిల్లు సీక్వెల్ కి కూడా DJ టిల్లు ఫార్మేట్ ఫాలో అవుతున్నాడా సిద్ధూ.. అప్పుడు, ఇప్పుడు ఒకటే..

DJ టిల్లు సక్సెస్ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. సినిమా పై, సినిమా రిలీజ్ పై అనేక వార్తలు వచ్చినా తాజాగా DJ టిల్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటలు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.

Published By: HashtagU Telugu Desk
Siddhu Jonnalagadda follow DJ Tillu Formate for Dj Tillu 2

Siddhu Jonnalagadda follow DJ Tillu Formate for Dj Tillu 2

సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda).. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, చిన్న చిన్న సినిమాలు చేస్తూ గత సంవత్సరం వచ్చిన DJ టిల్లు(DJ Tillu) సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. తక్కువ బడ్జెట్ లో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి(Neha Shetty) జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన సినిమా రిలీజయి భారీ విజయం సాధించింది. యూత్ ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఓ పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశారు.

ఇక DJ టిల్లు సక్సెస్ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. సినిమా పై, సినిమా రిలీజ్ పై అనేక వార్తలు వచ్చినా తాజాగా DJ టిల్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటలు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 15న DJ టిల్లు సీక్వెల్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటిస్తోంది.

తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అచ్చం DJ టిల్లు పోస్టర్స్ లాగే, అదే లుక్ లాగే అనిపించింది అందరికి. ఈ సినిమాలో DJ టిల్లు క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తూనే హీరోయిన్ ని మార్చారు. DJ టిల్లు ఎందుకు హిట్ అయిందో అదే అంశాలని సీక్వెల్ లో కూడా మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. కానీ మరీ పోస్టర్స్ ని కూడా గతంలో లాగే దింపుతారని అనుకోలేదు.

DJ టిల్లు సినిమాకు నేహా శెట్టి, సిద్ధూ కార్ లో కూర్చొని కిస్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు DJ టిల్లు సీక్వెల్ కి కూడా అనుపమ, సిద్ధూ కార్ లో కూర్చొని అలాగే కిస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

DJ టిల్లు సినిమాకి మొదట శ్రద్ధ శ్రీనాథ్ అనుకోని ఆ తర్వాత నేహా శెట్టిని తీసుకున్నారు. డైరెక్టర్ కూడా వేరే వాళ్ళను అనుకోని విమల్ కృష్ణని తీసుకున్నారు. ఇప్పుడు DJ టిల్లు సీక్వెల్ కి గత సినిమా వల్లనే కంటిన్యూ చేద్దామనుకున్నారు. కానీ తర్వాత హీరోయిన్, డైరెక్టర్ ని కూడా మార్చేశారు. దీంతో సిద్ధూ DJ టిల్లు ఫార్మేట్ ని అచ్చు ఫాలో అయిపోతున్నాడా? దానిలాగే చేసి దాని లాగే హిట్ కొట్టాలి అనుకుంటున్నాడా? మరీ ఇంత ఫాలో అయితే కష్టమేమో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ DJ టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ పై మాత్రం అంచనాలు బానే ఉన్నాయి.

 

Also Read : Amitabh Bachchan: అభిమానుల్ని కలిసినప్పుడు అమితాబ్ చెప్పులు వేసుకోరు ఎందుకో తెలుసా?

  Last Updated: 06 Jun 2023, 09:08 PM IST