Indian 2 : కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఇండియన్ 2’. 28ఏళ్ళ క్రిందట ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్ గా వస్తుంది. ఆ మూవీకి కొనసాగింపుగానే ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కమల్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా కనిపించబోతున్నారు. కాగా మూవీలో మెయిన్ లీడ్ కమల్ హాసన్ అయ్యినప్పటికీ సిద్ధార్థే ఎక్కువ కనిపించనున్నారట.
సిద్దార్థ్ చేసిన పాత్రే సినిమా కథని ముందుకు తీసుకు వెళ్తుందట. ‘విక్రమ్’ సినిమాలో ఫహద్ ఫాజిల్ ముందుండి ఎలా కథని నడిపిస్తాడో.. ఇప్పుడు ఈ సినిమాలో సిద్దార్థ్ కూడా అలానే కథని ముందుకు తీసుకు వెళ్లనున్నారట. ఒక సమయంలో కమల్ హాసన్ ని సేవ్ చేసేది కూడా సిద్దార్థ్ పాత్రే అంట. ఈ టైపు ఆఫ్ స్క్రీన్ ప్లే విక్రమ్ లో బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఎలా మెప్పిస్తుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో మరికొంతమంది స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్ జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని.. ఇలా చాలామంది స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని జులై 12న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ పైనే ఉన్న ఈ చిత్రం.. దాదాపు రెండు నెల ముందు నుంచే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసుకుంది.
నేడు తమిళనాడు జరగబోయే ఆడియో లాంచ్ ఫంక్షన్ తో ప్రమోషన్స్ లో మరింత డోసుని పెంచబోతున్నారు. టాలీవుడ్ లో కూడా ఒక గ్రాండ్ ఫంక్షన్ ని నిర్వహించబోతున్నారట. ఈ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకు వెళ్లేందుకు శంకర్ భారీ ప్లాన్ వేస్తున్నారు.