Site icon HashtagU Telugu

Cauvery Row : హీరో సిద్ధార్థ్‌కు తగిలిన ‘కావేరి’ సెగ..

Siddharth forced to leave press conference

Siddharth forced to leave press conference

‘కావేరి’ సెగ (Cauvery Water) హీరో సిద్దార్థ్ (Siddarth) కు తగిలింది. మరోసారి కర్ణాటక – తమిళనాడు మధ్య కావేరి జలవివాదం ఉద్రిత్తకు దారితీస్తుంది. ఇరు ప్రజలు వరుస నిరసనలు , ధర్నాలతో ఊగిపోతున్నారు. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడు (Tamilanadu)కు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు (Cauvery Board) ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయవద్దంటూ..ధర్నాలు చేస్తున్నారు. మరోపక్క రక్తం అయినా ఇస్తాము కాని తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వలేమనే నినాదాలతో కర్ణాటక దద్దరిల్లుతున్నది. ఈ తరుణంలో హీరో సిద్దార్థ్ కు చేదు అనుభవం ఎదురైంది.

Read Also : Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదల అయ్యేది ఆరోజే.. ఇట్స్ కన్ఫామ్

తెలుగులో బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట , బావ తదితర సినిమాలతో అలరించిన హీరో సిద్దార్థ్..తాజాగా ‘చిత్త’ (Chithha) కన్నడ వెర్షన్ ‘చిక్కు’ అనే సినిమా చేసాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న బెంగళూరు వచ్చాడు. మల్లేశ్వరంలోని ఓ థియేటర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. ఈ ప్రెస్ మీట్‌ ను కరవే స్వాభిమాని సేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘తమిళనాడుకు మా నీళ్లు పోతున్నాయి. ఇక్కడ తమిళ సినిమా గురించి ప్రెస్ మీట్ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఇవన్నీ అవసరమా?’ అని నటుడు సిద్ధార్థ్‌ను నిరసనకారులు ప్రశ్నించారు. అంతేకాకుండా, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీంతో సిద్ధార్థ్ మీడియా సమావేశం నిర్వహించకుండానే బయటకు వెళ్లిపోయారు. ఫుట్‌పాత్ మీద నడుచుకుంటూ కొంత దూరం వెళ్లగా.. సిబ్బంది క్యాబ్‌ను తీసుకొచ్చారు. ఆ క్యాబ్‌లో సిద్ధార్థ్ హోటల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కావేరి వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. వరుస బంద్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు పలుకుతుందో..