Site icon HashtagU Telugu

Siddharth : ఎంగేజ్మెంట్ పై సిద్దార్థ్ కామెంట్స్.. మేము సీక్రెట్‌గా ఏమి చేసుకోలేదు..

Siddharth Comments About Secret Engagement With Aditi Rao Hydari

Siddharth Comments About Secret Engagement With Aditi Rao Hydari

Siddharth : సినిమా స్టార్స్ సిద్దార్థ్ అండ్ అదితిరావు హైదరి కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో వచ్చిన ‘మహాసముద్రం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఫంక్షన్స్‌కి, ఈవెంట్స్‌కి, రెస్టారెంట్స్‌కి ఒకటిగా వెళ్తూ సందడి చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా తమ ప్రేమ విషయాన్ని బయటకి చెప్పలేదు.

అయితే గత నెల 27న తెలంగాణలోని వనపర్తి ఆలయంలో వీరిద్దరూ అత్యంత రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థం సమయంలో ఆ ఆలయ అర్చకులను కూడా లోనికి రానివ్వలేదని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ ఎంగేజ్మెంట్ గురించి సిద్ధార్థ్ అండ్ అదితి ఒక చిన్న ఫోటో పోస్ట్ వేసి అందరికి అఫీషియల్ గా తెలియజేసారు. తాజాగా ఈ నిశ్చితార్థం గురించి సిద్దార్థ్ ఓ ఈవెంట్ లో మాట్లాడారు.

ఒక ఈవెంట్ లో పాల్గొన్న సిద్దార్థ్ ని సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి సిద్దార్థ్ బదులిస్తూ.. “మేము సీక్రెట్‌గా ఏమి చేసుకోలేదు. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, బయట వారికి ఎవరికి చెప్పకుండా కేవలం మా కుటుంబ సభ్యులు మధ్యన ఎంగేజ్మెంట్ జరుపుకున్నాము. దానిని ప్రైవేట్ గా జరుపుకోవడం అంటారు. అలా కాకుండా ఇంటిలోని వారికీ కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్లి జరుపుకుంటే.. అది సీక్రెట్ ఎంగేజ్మెంట్ అంటారు” అంటూ కౌంటర్ ఇస్తూ సమాధానం ఇచ్చారు.

ఇక పెళ్లి గురించి ప్రశ్నించగా, సిద్దార్థ్ బదులిస్తూ.. “ఆ విషయం మా పెద్దవాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఒక అముఞ్చి ముహూర్తం చూసి ఎప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారో, అప్పుడే మేము పెళ్లి చేసుకుంటాము” అంటూ చెప్పుకొచ్చారు. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. గతంలో మరొకర్ని పెళ్లి చేసుకొని ఆ తరువాత విడాకులతో విడిపోయారు.

Also read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్.. బాలీవుడ్ నుంచి ఆ హీరో..