Site icon HashtagU Telugu

Siddharth & Aditi Rao : ఎట్టకేలకు అదితిరావును పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సిద్దార్థ్

Siddarth Adithi

Siddarth Adithi

సిద్దార్థ్ – అదితిరావు (Siddharth & Aditi Rao) ల జంట ఒకటికాబోతున్నారనే వార్త గత కొద్దీ రోజులుగా మీడియాలో ప్రచారం అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కళ్లముందు చెట్టాపట్టాలేసుకుంటూ ఇద్దరు తిరగడం..ఒకే రూమ్ లో కలిసి ఉండడం వీటి తాలూకా ఫొటోస్ , రీల్స్ ఇలా అన్ని బయటకు వచ్చినప్పటికీ..మీము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానం చెపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఓపెన్ అయ్యారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా సిద్దార్థ్ తెలిపి హమ్మయ్య అనిపించాడు.

2003లో బాయ్స్ మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్..మొదటి మూవీ తోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇలా వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఈ మూడు చిత్రాల హిట్ల తరువాత వరుస అవకాశాలు తలుపుతట్టాయి కానీ అవేవి పెద్దగా విజయాలు సాధించలేదు..ఇదే క్రమంలో ఆయనకు తెలుగు లో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాల పరంగా పెద్దగా వార్తల్లో నిలువకున్న.హీరోయిన్లతో డేటింగ్ ల వ్యవహారం తో మాత్రం మనోడు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. శృతి హాసన్ , సమంత తదితరులతో మనోడు చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ప్రస్తుతం మాత్రం గత కొద్దీ ఏళ్లుగా అదితిరావు తో ఉంటున్నాడు. తాజాగా వీరిద్దరూ వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన అది పెళ్లి కాదని నిశ్చితార్థం అని తర్వాత తెల్సిందే. ఇదే విషయాన్నీ తాజాగా సిద్దార్థ్ ఒప్పుకున్నాడు.

మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకుంటున్నారు. సీక్రెట్‌, ప్రైవేట్‌ అనే పదాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. మా ఎంగేజ్‌మెంట్‌కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్‌ ఫంక్షన్‌గా భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే, మాది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్‌ ఫంక్షన్‌. (వెడ్డింగ్‌ డేట్‌ను ఉద్దేశించి) ఇదేమీ షూటింగ్‌ డేట్‌ కాదు నేను నిర్ణయించడానికి. ఇది లైఫ్‌టైమ్‌ డేట్‌. పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. వాళ్లు ఎప్పుడు ఏం జరగాలనుకుంటే ఆ సమయంలో అది జరుగుతుంది” అని స్పష్టం చేసారు.

Read Also : Rahul Gandhi : మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలి: రాహుల్ గాంధీ