Site icon HashtagU Telugu

Nuvvostanante Nenoddantana: థియేటర్ల లోకి రీరిలీజ్ కాబోతున్న నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ.. ఎప్పుడో తెలుసా?

Mixcollage 17 Feb 2024 09 57 Am 2113

Mixcollage 17 Feb 2024 09 57 Am 2113

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను మరొకసారి థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. సూపర్ హిట్ సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు. కానీ మూవీ మేకర్స్ ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రావడం లేదు. మరి కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లను సాధిస్తూ అదరగొడుతున్నాయి. అయితే ఒకప్పుడు కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలను థియేటర్లో రిలీజ్ చేయగా దారుణంగా వేలలో కలెక్షన్స్ ను రాబడుతున్నాయి.

ఇకపోతే ఇప్పుడు థియేటర్ లలో మరొక సినిమా రీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎప్పుడు విడుదల కాబోతోంది అన్న వివరాల్లోకి వెళితే.. ఆ సినిమా మరేదో కాదు నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ ఐకానిక్ లవ్ స్టోరీని మళ్లీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17, 18 తేదీల్లో మళ్లీ విడుదల చేయనున్నారట. ఈ మూవీ ఇప్పుడు క్విట్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ రీ రిలీజ్‌ చేస్తోంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా 2005లో విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది.

అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి. రొమాంటిక్/కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ చిత్రాన్ని కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించారు. కాగా ఈ చిత్రంలో సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రలలో నటించగా, దివంగత నటుడు శ్రీహరి, సునీల్, అర్చన శాస్త్రి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతోనే ప్రభుదేవా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.