Site icon HashtagU Telugu

Siddharth and Aditi: సిద్ధార్థ్, అదితి పెళ్లి చేసుకోబోతున్నారా!

Siddarth And Aditi Rao

Siddarth And Aditi Rao

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట తొలిసారిగా “మహా సముద్రం” మూవీ కలిసి నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ, ఇద్దరి మధ్య ప్రేమను చిగురించేలా చేసింది. ఆ సినిమా నుండే వారిద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగింది.  అయితే ఇప్పటి వరకు అదితి రావు వ్యవహరం బయటికి రాకుండా సిద్దార్థ్ జాగ్రత్త పడ్డాడు. కానీ చివరకు అదితి రావు ఇంటికి సిద్దార్థ్ వెళ్లడంతో పెళ్లి వార్తలు షికారు చేస్తున్నాయి.

సిద్ధార్థ్, అదితి ప్రేమలో ఉన్నారని, అయితే వారు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ప్రేమికులుగా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. సిద్ధార్థ్ ఇంతకుముందు శృతి హాసన్, సమంత మరియు సోహా అలీ ఖాన్‌లతో డేటింగ్ చేశాడు. అదితి రావు 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంది. ఐదు సంవత్సరాల తరువాత తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదితి సిద్దార్థ్ కు దగ్గరైనట్టు టాక్.