Site icon HashtagU Telugu

Siddharth: హీరో సిద్దార్థ్‌కు ఎయిర్‌పోర్టులో అవమానం.. ఏం జరిగిందంటే..?

SIDDARTH

Resizeimagesize (1280 X 720) (4) 11zon

బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్‌ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని సిద్ధార్థ్ ఆరోపించారు.

నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను 20 నిమిషాల పాటు వేధించారని ఆరోపిస్తూ సిద్ధార్థ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశాడు. బ్యాగ్‌లోంచి నాణేలు తీయమని చెప్పి హిందీలోనే మాట్లాడాడు. నా తల్లిదండ్రులు కూడా ఇంగ్లీషులో మాట్లాడమని సిబ్బందిని అభ్యర్థించారు. దీనిపై విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్పందిస్తూ.. భారత్‌లో ఇలాగే జరుగుతుందని చెప్పారు.

Also Read: Salman Khan Fans: కట్టలు తెంచుకున్న అభిమానం.. సల్మాన్ అభిమానులపై లాఠీచార్జి!

మంగళవారం మధ్యాహ్నం మధురై ఎయిర్‌పోర్టులో సిద్దార్థ్‌ను సీఆర్‌పీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన వెంట వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెద్ద వయసు తల్లిదండ్రుల జేబులు, సంచుల్లో నుంచి నగదును తీయాలని ఆర్డర్‌ వేశారు. హిందీలో మాట్లాడుతూ అసహనం కలిగేలా ప్రవర్తించారు. అధికారులు పదే పదే హిందీలో మాట్లాడటంతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరినప్పటికీ నిరాకరించారు. 20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులను సీఆర్‌పీ సిబ్బంది అవమానించారని, తనను కూడా వేధింపులకు గురిచేశారని సిద్దార్థ్‌ సోషల్‌ మీడియా వేదికపై ఆరోపించారు.

Exit mobile version