Siddharth – Aditi Rao Hydari : గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న సిద్దార్థ్ – అదితిరావు హైదరి జంట నేడు పెళ్లి చేసుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్న సిద్దార్థ్ – అదితి గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ముంబైలో రెగ్యులర్ గా బయట మీడియాకు కనపడి వీరి డేటింగ్ విషయం వైరల్ అయింది. ఇటీవల కొన్ని నెలల క్రితమే ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా నేడు వివాహం చేసుకున్నారు.
సిద్దార్థ్ – అదితి రావు హైదరిల వివాహం వనపర్తి శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. నేడు ఉదయమే వీరి వివాహం జరిగినట్టు సమాచారం. అయితే నిశ్చితార్థం సైలెంట్ గా చేసుకున్నట్టే పెళ్లి కూడా ఎవరిని పిలవకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే చేసుకున్నారు. వివాహం అనంతరం వీరి పెళ్లి ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక సిద్దార్థ్, అదితి ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
Also Read : Shocking Surprise in Devara : ఎన్టీఆర్ చెప్పిన సర్ప్రైజ్ ఫై అంచనాలు..