Site icon HashtagU Telugu

Siddhaarth Oy : ఓయ్ రీ రిలీజ్ కలెక్షన్స్.. వారెవా ఇది కదా అసలు సిసలు మాస్ అంటే..!

Siddhaarth Oy Rerelease Record Collections

Siddhaarth Oy Rerelease Record Collections

Siddhaarth Oy సిద్ధార్థ్ షామిలి జంటగా ఆనంద్ రంగ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఓయ్. 15 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా రీసెంట్ గా వాలెంటైన్స్ డే రోజు రీ రిలీజైంది. సిద్ధార్థ్, షామిలి జంటతో పాటుగా ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ సంగీత ప్రియులకు ప్లే లిస్ట్ లో ఉంటాయి.

రీ రిలీజ్ టైం లో కూడా ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా వాలెంటైన్స్ డే రోజు హైదరాబాద్ లోనే 70 లక్షల దాకా కలెక్ట్ చేయగా ఓవరాల్ గా తెలుగు రెండు రాష్ట్రాల్లో కోటిన్నర దాకా వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది.

ఓయ్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం సిద్ధార్థ్ ని కూడా ఖుషి చేస్తుంది. ఓయ్ తో పాటు వాలెంటైన్స్ డే రోజు బేబీ, సీతారామం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలతో మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకే పాతిక లక్షల దాకా వచ్చాయి కానీ మిగతా సినిమాలకు పెద్దగా వసూళ్లు రాలేదు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఊరు పేరు భైరవ కోన సినిమా పెయిడ్ ప్రీమియర్స్ వేయగా 1.10 కోట్లు మాత్రమే వసూళ్లు రాగా ఓయ్ సినిమా దానికి మించి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Also Read : Viswak Sen : నాగ చైతన్య సినిమా ఆడిషన్ కు విశ్వక్.. కానీ జరిగిందేంటంటే..!