Site icon HashtagU Telugu

Teaser : స్త్రీ ఎవడికీ దాసీ కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా!

నేచరల్ స్టార్ నాని.. వర్సటైల్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్ లోనే హిస్టరీకల్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు.వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక మూవీల్లో ఒకటైన ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నాని, సాయిపల్లవి ఫస్ట్ లుక్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్ వస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులోని సంభాషణలు, స్ర్కీన్ ప్లే రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. “అడిగే అండలేదు .. కలబడే కండలేదని రక్షించవలసిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే, కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ రాయ్’. ”స్త్రీ ఎవడికీ దాసీ కాదు … ఆఖరికి ఆ దేవుడికి కూడా” డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Exit mobile version