Site icon HashtagU Telugu

NTR : ఎన్టీఆర్ తో శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్.. ఏం జరుగుతుంది..?

Shyam Singha Roy Director Rahul Sankrityan Story for NTR

Shyam Singha Roy Director Rahul Sankrityan Story for NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో సినిమా చేయాలని చాలామంది యువ దర్శకులకు ఉంటుంది. అటు స్టార్ డైరెక్టర్స్ కూడా తారక్ డేట్స్ కోసం క్యూ లో ఉన్నారు. అలాంటి టైం లో ఎన్.టి.ఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నా అంటున్నాడు శ్యాంమ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్.

We’re now on WhatsApp : Click to Join

విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా చేసిన అతను సెకండ్ మూవీగా నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న రాహుల్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.

ఎన్.టి.ఆర్ కోసం ఒక అద్భుతమైన పీరియాడికల్ స్టోరీ రాసుకున్నాడత రాహుల్.. తారక్ కి కలిసి వినిపించాడట కూడా.. ఎన్.టి.ఆర్ కు కథ బాగానే ఉందని అనిపించినా సరే ఇప్పుడు ఈ సినిమా చేయాలంటే ఎలా లేదాన్నా 3 ఏళ్ల దాకా వెయిట్ చేయాలని చెప్పాడట. ఎందుకంటే తారక్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఆయనతో సినిమా అంటే ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది.

ప్రస్తుతం దేవర పార్ట్ 1 ని పూర్తి చేసే పనుల్లో ఉన్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా తర్వాత వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ ఆల్రెడీ కమిట్ అయ్యాడు. సో శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ తో సినిమా చేయాలంటే ఎలా లేదన్నా రెండేళ్ల దాకా టైం పడుతుంది.

తారక్ తో కాకుండా మరో హీరోతో సినిమా చేస్తాడా లేదా అన్నేళ్లు వెయిట్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఎన్.టి.ఆర్ తో రాహుల్ అనుకున్న కథ అదిరిపోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Also Read : Sithara Dance Dum Masala Song : దమ్ మసాలా సాంగ్ కి సితార స్టెప్పులు.. వీడియో చూస్తే ఆమెకు ఫ్యాన అయిపోతారు..!