Jr NTR Emotional: శ్యామ్ మరణం చాలా బాధాకరమైంది, జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్

శ్యామ్ మరణం చాలా బాధాకరమైన సంఘటన అని అతని తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

Published By: HashtagU Telugu Desk
Junior

Jrntr

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే శ్యామ్ అనే వీరాభిమాని అనుమానాస్పద మృతి వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా శ్యామ్ మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషాద సంఘటన గురించి తారక్ తెలియగానే ప్రెస్ నోట్ విడుదల చేస్తూ తన స్పందనను తెలియజేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “శ్యామ్ మరణం చాలా బాధాకరమైన సంఘటన. అతని తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. శ్యామ్ ఎలా చనిపోయాడో తెలియడం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాను. ఆయన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కళాశాల విద్యార్థి . చింతలూరు గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త ట్విట్టర్‌లో వైరల్ కావడంతో, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ, శ్యామ్ అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని నేను గట్టిగా కోరుతున్నాను. వైసీపీ సభ్యుల ప్రమేయం ఉందని, వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆరోపించారు.

Also Read: AP BRS: వైసీపీ పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట

 

  Last Updated: 27 Jun 2023, 05:35 PM IST