ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR-Koratala Shiva) కలయికలో పాన్ ఇండియా గా తెరకెక్కుతున్న దేవర (Devara) చిత్రానికి వరుస తలనొప్పులు ఎదురవుతున్నాయి. నిన్నటి కి నిన్న ఎన్టీఆర్ లుక్ తాలూకా పిక్ లీక్ అవ్వగా..తాజాగా సినిమాలోని కీలక పాత్రకు సంబదించిన అప్డేట్ ను హీరోయిన్ (Marathi actress Shruti Marathe) రివీల్ చేయడం తో మేకర్స్ తలపట్టుకోవాల్సి వచ్చింది.
RRR తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ.ఎన్టీఆర్ (NTR)..ఇప్పుడు దేవర (Devara ) మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి తగ్గట్లే సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే సినిమా యూనిట్ కు లీక్ లా బెడద ఎక్కువైపోయింది.
ప్రస్తుతం గోవాలో(Goa) షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ లో జాన్వీతో ఓ సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. గోవాలో సముద్రం దగ్గర షూట్ జరుగుతుండగా ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో లీక్ అయింది. చాలా దూరంగా చెట్టు మీద నుంచి ఎవరో ఈ వీడియోని తీసి లీక్ చేసారు. ఈ వీడియోని అభిమానులు తెగ వైరల్ చేసారు. దీంతో యూనిట్ చేసేది ఏమిలేక ఎన్టీఆర్ పిక్స్ ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా..దేవర సినిమాలో తాను నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే (Marathi actress Shruti Marathe) స్వయంగా ప్రకటించారు. ‘దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ మూవీలో జాన్వీ కపూర్ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుండగా, శ్రుతి రెండో హీరోయిన్ గా చేస్తున్నట్లు తేలిపోయింది. వాస్తవానికి ఈ రోల్ ను చాల రహస్యంగా ఉంచాలని మేకర్స్ భావించారు. కానీ శృతి మాత్రం బయపెట్టేసరికి మేకర్స్ తలపట్టుకున్నారు.
Read Also : Tillu Square Censor Talk : టిల్లు స్క్వేర్ సెన్సార్ రిపోర్ట్