Site icon HashtagU Telugu

Shruti Haasan’s Boyfriend: నానికి అదిరిపొయే గిఫ్ట్ ఇచ్చిన శృతిహాసన్ ప్రియుడు.. దసరా డూడుల్ వైరల్

Dasara

Dasara

నేచురల్ స్టార్ నటించిన దసరా మూవీ భాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 53 కోట్లు వసూలు చేసిందంటే సినిమా ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు టాలీవుడ్ హీరోలు కూడా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పటికే మహేశ్, ప్రభాస్ దసరా మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. నాని యాక్టింగ్ సూపర్ అంటూ కితాబు ఇచ్చారు. తాజాగా శృతిహాసన్ ప్రియుడు శాంతను హజారికా దసరా మూవీ పట్ల తన అభిమానం చాటుకున్నాడు.

దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ లో రూపొందించారు. దసరా చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ అదిరిపోగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా శృతిహాసన్ శాంతను హజారికాతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. కాగా హజారిక డూడుల్ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే. నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.మొదటి సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.