Shruti Haasan: శంతను నా సర్వస్వం.. మా ప్రేమ వ్యవహారాన్ని దాచే ప్రసక్తే లేదు : శ్రుతిహాసన్

కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ తమ లవ్ గురించి.. లవర్ బాయ్ గురించి ఎన్నడూ దాచిన దాఖలాలు లేవు.

Published By: HashtagU Telugu Desk
Shruti

Shruti

కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ తమ లవ్ గురించి.. లవర్ బాయ్ గురించి ఎన్నడూ దాచిన దాఖలాలు లేవు. బహిరంగంగానే.. తన ప్రేమికుడు శంతను హజారికా గురించి ఆమె చెబుతుంటుంది. అతడితో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తుంటుంది. గత రెండేళ్లుగా శ్రుతిహాసన్ తన లవర్ తోనే కలిసి జీవిస్తోంది. శంతను హజారికా .. డూడుల్ ఆర్టిస్ట్, ర్యాపర్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. తాజాగా ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో శ్రుతిహాసన్ మాట్లాడుతూ తన లవర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన ప్రేమ గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాహాటంగా చెప్పుకోవడం వెనుక ఉన్న ముఖ్య కారణాన్ని ఆమె వెల్లడించింది.

గతంలో బాహాటంగా మాట్లాడలేదు

“గతంలోనూ నాకు రిలేషన్ షిప్
ఉండేది. దాని గురించి అప్పట్లో నేను బాహాటంగా మాట్లాడలేదు. అవతలి వైపు ఉన్న వ్యక్తి కూడా రిలేషన్ షిప్ గురించి బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను ప్రేమిస్తున్న వ్యక్తి (శంతను హజారికా)ని చూసి గర్విస్తున్నాను. ఆయన అద్భుతమైన వ్యక్తి.. చాలా ట్యాలెంటెడ్. నేను సినీ ఇండస్ట్రీలో ఎంతో శ్రమిస్తున్నాను. నా లవర్ తో సగర్వంగా జీవిస్తున్నాను. ఆయనే నా సర్వస్వం. నా జీవితంలో అత్యంత ముఖ్య భాగం శంతను. ఆయనపై ఉన్న ప్రేమను లోకం దృష్టి నుంచి దాచాల్సిన అవసరమే లేదు” అని శ్రుతిహాసన్ వ్యాఖ్యానించింది.

అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం..

“తన ప్రియురాలు లేదా ప్రియుడి వివరాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. నేను మాత్రం అలా ఉండదల్చుకోలేదు. నా ప్రేమ గురించి ధైర్యంగా అందరికీ చెబుతాను.శంతను కూడా నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. ” అని శ్రుతిహాసన్ తెలిపారు.

  Last Updated: 29 Jun 2022, 11:35 PM IST